క్రాకర్స్ వద్దు, మొక్కలు ముద్దు

Puri Jagannadh

మ్యూజింగ్స్ అంటూ తన మనసులో ఉన్నది ఉన్నట్టు కక్కేస్తున్నాడు దర్శకుడు పూరి జగన్నాధ్. ఇప్పటికే అతడి మ్యూజింగ్స్ చాలా మందిని ఎట్రాక్ట్ చేయగా.. మరికొన్ని వివాదాస్పదమయ్యాయి కూడా. ఈసారి దీపావళిని టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేశాడు పూరి.

కిడ్నాప్డ్ వైఫ్ క్షేమంగా ఇంటికి తిరిగి రావడం వల్ల ఈ పండగ మొదలైందని తనదైన స్టయిల్ లో చెప్పుకొచ్చాడు పూరి. అంటే అతడి ఉద్దేశం.. రావణాసురుడి చెర నుంచి సీతను రాముడు విడిపించాడని అర్థం. ఇలా తన ప్రసంగాన్ని స్టార్ట్ చేసిన పూరి.. దీపావళికి బాణసంచా కాల్చే కంటే మొక్కలు పెంచడం చాలా మంచిదని చెప్పుకొచ్చాడు.

  • కొన్ని వేల సంవత్సరాల వరకు దీపావళిని దీపాలతోనే జరుపుకున్నాం. బ్రిటిషర్ల దయ వల్ల క్రాకర్స్ యాడ్ చేశాం.
  • దీపావళికి క్రాకర్స్ కాల్చకూడదు, గవర్నమెంట్ కూడా బ్యాన్ చేయాలి.
  • మందుగుండ సామాన్లు పేల్చేసుకొని, ఆ పొల్యూషన్ లో మనం మన పిల్లలు నవ్వుతూ కూర్చుంటాం.
  • క్రాకర్స్ బదులు మొక్కలు కొనండి. మొక్కల పక్కనే కూర్చోండి, మొక్కల పక్కనే పడుకోండి, మొక్క ముందే ఎవరితోనైనా మాట్లాడాలి. మొక్క-మీరు కలిసి మ్యూజిక్ వినాలి.
Advertisement
 

More

Related Stories