మళ్ళీ బ్యాంకాకే వెళ్లనున్న పూరి?

Ananya, VD and Puri

ఒకప్పుడు పూరి జగన్నాధ్ కేరాఫ్ అడ్రస్ …బ్యాంకాక్ అన్నట్లుగా ఉండేది. కథ రాయాలన్నా, పాటలు తీయాలన్నా, సీన్లు షూట్ చెయ్యాలన్నా థాయిలాండ్ కి తయారయ్యేవాడు. చిరుత, దేవుడు చేసిన మనుషులు వంటి చిత్రాలు మొత్తంగా అక్కడే తీశాడు. ఆ తర్వాత స్పెయిన్ కి షిఫ్ట్ అయ్యాడు. హార్ట్ ఎటాక్, ఇద్దరమ్మాయిలతో, పైసా వసూల్ వంటి చిత్రాలు మేజర్ గా బార్సిలోనా, ఇతర స్పెయిన్ పట్టణాల్లోనే చుట్టేశాడు.

ఐతే.. ఇస్మార్ట్ శంకర్ నుంచి పంథా మార్చాడు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో బ్యాంకాక్, బార్సిలోనాలకు దూరంగా ఉన్నాడు. హైదరాబాద్, గోవాలో మాక్సిమం మూవీ తీశాడు. ఇటీవల ప్రారంభించిన విజయ్ దేవరకొండ మూవీ కూడా 40 శాతం ముంబైలోనే చిత్రీకరించాడు. మిగతా భాగం కూడా ముంబైలోనే తీద్దామనుకునేసరికి కరోనా క్రైసిస్ వచ్చింది.

ఈ సినిమా కోసం ఫారీన్ ఫైటర్లతో యాక్షన్ సీన్లు తీయాలి. ఇప్పుడు వాటిని ప్రశాంతంగా బ్యాంకాక్ లో తీద్దామనుకుంటున్నాడట. సో… పూరి మళ్ళీ థాయిలాండ్ కి హాయ్ చెపుతున్నాడు.

Related Stories