లాక్డౌన్ ముందు రాసింది చించేయండి!

Puri Jagannadh

ఔత్సాహిక రైటర్స్ కు టిప్స్ అందిస్తున్నాడు దర్శకుడు పూరి జగన్నాధ్. లాక్ డౌన్ టైమ్ లో సినీ ప్రేక్షకులు మారిపోయారని.. ఇకపై ఏది రాసినా గ్లోబల్ ను దృష్టిలో పెట్టుకొని రాయమంటున్నాడు. యంగ్ రైటర్స్ కు పూరి ఇచ్చిన సలహాల్లో కొన్ని…

– లోకల్ కంటెంట్ బాగుంటే లాంగ్వేజ్ తో సంబంధం లేదు. రీజనల్ ను దృష్టిలో పెట్టుకొని సినిమా తీయకూడదు. ప్రపంచం మొత్తం నా సినిమా చూస్తోంది అనుకొని తీయాలి.

– మాస్ సినిమా తీసినా, కోటి రూపాయలతో చిన్న సినిమా తీసినా గ్లోబల్ మొత్తం నా సినిమా చూస్తుందనే స్పృహతో తీయాలి

– కథ చెప్పాల్సిన నటులు, ప్రొడ్యూసర్లు రోజూ హాలీవుడ్ కంటెంట్ చూస్తున్నారు. పబ్లిక్ కూడా అంతే. కథలు రాసేవాళ్లు కూడా ఆ రేంజ్ లో ఉండాలి.

– కంటెంట్ బాగుంటే.. సబ్ టైటిల్స్ లేకపోయినా కొరియన్ సినిమా చూస్తున్నారు. సి-సెంటర్ జనాలు కూడా చైనా సినిమాలు చూస్తున్నారు. మనమే బి-సెంటర్, సి-సెంటర్ కథలంటూ ఆలోచిస్తున్నాం.

– లాక్ డౌన్ కు ముందు రాసుకున్న స్క్రిప్టులు ఏమైనా ఉంచే చించేయండి. మనసు ఒప్పుకోకపోతే అదే పాయింట్ ను మళ్లీ ఫ్రెష్ గా రాయండి.

– వేల కోట్లు ఖర్చుపెట్టడానికి ఎన్నో ఓటీటీలు రెడీగా ఉన్నాయి. రైటర్స్ నిద్రపోతే ఇండస్ట్రీ నిద్రపోతుంది. నువ్వు రైటర్ వైతే రిలాక్స్ అవ్వకు. సంవత్సరాల తరబడి స్క్రిప్టులు రాయొద్దు.

Related Stories