మొదట ప్రశంస, ఇప్పుడు ట్రోలింగ్

Puri Jagannadh

పూరికి మాటల మాంత్రికుడు అన్న పేరు లేదు కానీ పూరి డైలాగులు బాగుంటాయి. తూటాల్లా పేలుతాయి జ’గన్’ డైలాగులు. ఆయన రైటింగ్ కున్న పవర్ మరోసారి తెలిసింది పాడ్ కాస్ట్ ఆడియోల వల్ల.

రీసెంట్ గా పాడ్ కాస్ట్ లోకి ఎంటరయ్యాడు పూరి జగన్నాధ్. ఇప్పటికే తన సినిమాల్లో డైలాగ్స్ తో మెస్మరైజ్ చేసిన ఈ డైరక్టర్.. ఇప్పుడు పాడ్ కాస్ట్ రూపంలో చెలరేగిపోతున్నాడు. వివిధ అంశాలపై పూరి జగన్నాధ్ తనదైన శైలిలో ఇస్తున్న విశ్లేషణలు యూత్ ను కట్టి పడేస్తున్నాయి.

డబ్బు, జీవితం, అమ్మాయిలు, తెలివితేటలు, ఉత్సాహం, పుస్తకాలు, వయసు, భర్త, ఆచారాలు, రిజర్వేషన్లు.. ఇలా అనేక అంశాలపై పూరి జగన్నాధ్ చెబుతున్న మాటలు అందర్నీ ఎంతగానో ఎట్రాక్ట్ చేస్తూ వస్తున్నాయి.

ఐతే… ఇదంతా స్టార్టింగ్ లో. ఇప్పుడు ట్రోలింగ్ మొదలైంది. ముఖ్యంగా పేదరికం, ఓటు హక్కు, రిజర్వేషన్ వంటి సున్నితమైన అంశాలపై సామజిక స్పృహ లేకుండా చేసిన కామెంట్లతో బాగా ట్రోలింగ్ ఎదుర్కొంటున్నాడు. వైట్ రేషన్ కార్డు ఉన్నోడికి ఓటు కక్కు తీసెయ్యాలనడం, పేదవాడుగా పుట్టడం కాదు పేదవాడుగా చావడం తప్పు వంటి మాటలు ఆయన డబ్బు “బలుపు”కి నిదర్శనం అంటూ చెడుగుడు ఆడుతున్నారు. ఈ దేశంలో నిమ్న వర్గాల స్థితిగతులు, కుల వ్యవస్థ తెలీకుండా… జూబిలీహిల్స్ బ్యాచ్ చేసే మాటలు ఇలాగే ఉంటాయి అంటూ ఒక సామజికవేత్త తన పేస్ బుక్ లో గట్టిగా పూరికి కౌంటర్ ఇచ్చారు.

మొత్తమ్మీద, పూరి పాడ్ కాస్ట్ ఆడియో బుల్లెట్లు పేలుతున్నాయి.

Related Stories