ఎక్కువ టైం పడుతున్న మూవీ ఇదే

Ananya, VD and Puri

ఈ లాక్ డౌన్ టైమ్ లో 3 కథలు రెడీ చేసుకున్నాడు పూరి జగన్నాధ్. ఈ 3 కథల్లో ఒక కథతో ఆయన బాలకృష్ణతో సెట్స్ పైకి వెళ్తాడని ఆమధ్య ప్రచారం జరిగింది. వాటిపై ఇంకా ఎలాంటి స్పష్టత రాకముందే, ఇప్పుడు యష్ పేరు తెరపైకి వచ్చింది. యష్ తో పూరి జగన్నాధ్ పాన్ ఇండియా మూవీ ప్లాన్ చేస్తున్నాడట. ఐతే, ఇందులో వాస్తవం ఎంత అనేది చూడాలి. ముఖ్యంగా పూరి ఇప్పుడు తన దృష్టిని విజయ్ దేవరకొండతో చేస్తున్న పాన్ ఇండియా సినిమాపైనే పెట్టాడు.

లాక్ డౌన్ కారణంగా వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా, పూరి జగన్నాథ్ కెరీర్ లోనే ఎక్కువ ప్రొడక్షన్ టైమ్ తీసుకున్న సినిమాగా నిలిచింది.

అందుకే ఈ దర్శకుడు ముందు దీన్ని పూర్తి చేసి ఆ తర్వాత స్పీడ్ గా ఓ రెండు సినిమాలు తీద్దామని అనుకుంటున్నాడట. ఆ తర్వాతే మళ్ళీ పాన్ ఇండియా చిత్రాలు. ప్రస్తుతానికి విజయ్ తో చేస్తున్న ఈ మూవీని పూర్తిచేసిన తర్వాతే, మిగతా విషయాల గురించి ఆలోచించాలని ఫిక్స్ అయ్యాడు.

Related Stories