
పాన్ ఇండియా క్రేజ్ లో తన మకాం ముంబైకి మార్చారు పూరి జగన్నాధ్. ‘లైగర్’ ప్రీ-ప్రొడక్షన్ కన్నా ముందే ముంబైకి షిఫ్ట్ అయ్యారు పూరి జగన్నాధ్. ముంబైలో నెలకు 10 లక్షల రెంట్ కడుతూ అక్కడ నివాసం ఏర్పరచుకున్నారు. “లైగర్” హిట్ ఐతే “జనగణమన” కూడా ముంబైలోనే తీయాలనేది ప్లాన్. ఐతే, ఇప్పుడు అంతా తారుమారు అయింది.
ఇక ముంబైలో పని ఏమి లేదు. ప్రస్తుతానికి ఆయన ముంబైలోనే ఉంటున్నా… అది ఖాళీ చేసి హైదరాబాద్ కి షిఫ్ట్ అవుతారని టాక్. ముందుగా నష్టపోయిన బయ్యర్లకు ఎంతో కొంత నష్టం పూడ్చాలి. అది చేసిన తర్వాత తదుపరి చిత్రం గురించి ఆలోచిస్తారు.
ఇంతకుముందు ప్లాన్ చేసిన ‘జన గణ మన’ ఆగిపోయినట్లే. ఆ సినిమా చేసేందుకు ఇప్పుడు విజయ్ దేవరకొండకి ఆసక్తి లేదు. పూరి జగన్నాధ్ కి ఇబ్బందే. నిర్మాతలు భయపడుతున్నారు. దాంతో, మరో ప్రాజెక్ట్ ఆయన చూసుకోవాలి. ఈ లోపు విమర్శలు, ట్రోలింగ్ తో టెన్షన్ పడకూడదని సోషల్ మీడియాకి దూరంగా ఉంటున్నారు.
చాలా కాలంగా పూరి సోషల్ మీడియాలో యాక్టివ్ గా లేరు. ఇప్పుడు ఛార్మి కూడా ‘కొంతకాలం’ దూరం అని బ్రేక్ తీసుకున్నారు.