- Advertisement -

పూరి జగన్నాధ్ – విజయ్ దేవరకొండ కాంబినేషన్లో రూపొందుతోన్న “ఫైటర్” ఆగిపోయింది అని ప్రచారం నేపథ్యంలో ఈ టీం ఇప్పుడు షూటింగ్ అప్ డేట్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. ఈ సినిమా షూటింగ్ కొత్త షెడ్యూల్ హైద్రాబాద్లో మొదలుపెట్టాలా? లేక విదేశాల్లోనా అనేది ఇంకా తేల్చుకోలేదు టీం.
విదేశాల నుంచి ఫైటర్స్ రావాలి. అది మెయిన్ ఇంపార్టెంట్. అలాగే కీలకమైన యాక్షన్ సీన్లో రియల్ ఇంటర్ నేషనల్ బాక్సర్ నటించాలి. ఇంతకుముందు ఆ పాత్ర కోసం చాలా పెద్ద పేర్లు అనుకున్నారు. కానీ ఇప్పుడు మార్కెట్ కండిషన్స్ మారాయి. కరోనా తర్వాత ఏర్పడిన పరిస్థితుల్లో ఎక్కువ బడ్జెట్ పెట్టలేరు. ఇంటర్ నేషనల్ బాక్సర్ అంటే పారితోషికం చాలా ఇవ్వాలి. దాని బదులు ఒక ఛోటా మోటా బాక్సర్ ని తీసుకుంటారట.
త్వరలోనే దీనిపై పూరి ఓ నిర్ణయం తీసుకోబోతున్నారు.