- Advertisement -

పూరి డైలాగ్స్, ఆయన మాటలకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. అందుకే పూరి పాడ్ కాస్ట్ కు లెక్కలేనంత ఫాలోయింగ్. ఆగస్ట్ 15 సందర్భంగా పూరి మరోసారి తన మాటల తూటాలు పేల్చాడు. ఫ్రీడమ్ అంటే ఏంటో తనదైన స్టయిల్ లో చెప్పాడు. అందులోంచి ఓ 3 ముక్కలు..
- ఫ్రీడమ్ వల్ల 3 చక్కటి విషయాలు నేర్చుకున్నాం. ఒకటి.. పెంట తీసి నెత్తిన రాసుకోవడం, రెండు.. కోడిగుడ్డు మీద వెంట్రుకలు పీకడం, మూడు.. పుల్ల పెట్టి పక్కోడ్ని కెలకడం. అందుకే ఒక పేపర్ తీసి నేను చేసిన వెధవ పనులు రాసుకుందాం. ఎవ్వరికీ చూపించొద్దు. అలా రాసుకొని భవిష్యత్తులో అవి చేయకుండా జాగ్రత్తపడుదాం.
- 200 ఏళ్లు యుద్ధం చేసి ఫ్రీడమ్ తెచ్చుకొని ఉపయోగం ఏంటి.. మనం మారకపోతే ఏ నాయకుడు మనల్ని మార్చలేడు. మీతో పాటు మీ పిల్లలు నేర్చుకుంటారు.
- ఇండో-చైనా బార్డర్ లో సైనికులు రాళ్లతో కొట్లాడారు. ప్రాణం పోయేంత వరకు ఫైట్ చేశారు. అదంతా మన కోసం, మన దేశం కోసం చేశారు. వాళ్ల కోసమైనా మనం చీప్ పనులు మానేద్దాం. సైనికుల్లా నువ్వు దేశం కోసం చావనక్కర్లేదు. కనీసం ఆ గోడమీద ఉచ్చ పోయకపోతే చాలు. అది కూడా దేశభక్తే.