- Advertisement -

పెద్ద సినిమాలపై అందరికీ ఆసక్తి ఉంటుంది. అందుకే, ఈ సినిమాలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు షూటింగ్ దశలో లీక్ అవుతుంటాయి. తాజాగా “పుష్ప 2” సినిమా ఈ బెడద అనుభవిస్తోంది.
“పుష్ప 2″కి చెందిన కొన్ని ఫోటోలు లేటెస్ట్ గా సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయ్యాయి. అల్లు అర్జున్, రష్మిక ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. ప్రస్తుతం కొన్ని కీలక సన్నివేశాలను తీస్తున్నారు. ఫోటోల లీక్ తో దర్శకుడు సుకుమార్ కలవరపడుతున్నట్లు టాక్.
పుష్ప మొదటి భాగం భారీ విజయం సాధించింది. దాంతో రెండో భాగం విషయంలో అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక నిర్మాణ సంస్థ కూడా భారీ మొత్తానికి తమ సినిమా ఓటిటి రైట్స్ అమ్మేసింది. సినిమాకి సంబంధించిన నిర్మాణ ఖర్చు మొత్తం ఈ అమ్మకాల ద్వారా వచ్చినట్లు టాక్.
విడుదలకు ముందే నిర్మాణ సంస్థ భారీగా లాభాల్లో ఉంటుంది.