“పుష్ప 2” పూర్తి అయ్యాకే

Rashmika Mandanna

రష్మిక మందాన ఒక్కసారిగా బాలీవుడ్ లో కూడా పెద్ద హీరోయిన్ అయిపోయింది. “యానిమల్” చిత్రం ఆమె జీవితాన్ని మార్చేసింది. ఆమె కెరీర్లోనే అతిపెద్ద హిట్ చిత్రంగా నిలిచింది “యానిమల్”. ఇప్పుడు బాలీవుడ్ లో కూడా ఆమెకి యమా క్రేజ్ ఉంది.

ఆమెకి ఆఫర్లు ఫుల్లుగా వస్తున్నా టైం లేకపోవడంతో ఇప్పుడు ఒకే ఒక్క హిందీ సినిమా ఒప్పుకొంది. “పుష్ప 2” షూటింగ్ మొత్తం పూర్తి అయ్యాకే మిగతా బాలీవుడ్ పెద్ద ప్రాజెక్టులను సైన్ చేస్తుందట.

ఒకవైపు తెలుగులో “పుష్ప 2”, “ది గర్ల్ ఫ్రెండ్”, “కుబేర” సినిమాలు ఉండగా, హిందీలో “చావా” అనే మూవీ ఉంది. ఈ సినిమాల షూటింగ్ లు అన్నీ ఏక కాలంలో జరుగుతున్నాయి. ఒక మూవీ షూటింగ్ నుంచి ఇంకో మూవీ షూటింగ్ కి వెళ్తూ ప్రస్తుతం మేనేజ్ చేస్తోంది. ఇటీవలే ఆస్ట్రేలియాలో హిందీ మూవీ షూటింగ్ పూర్తి చేసింది.

మరోవైపు, ప్రభాస్ హీరోగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తీసే చిత్రంలో కూడా రష్మిక నటించనుంది అనే టాక్ నడుస్తోంది. కానీ వంగా ఇంకా స్క్రిప్ట్ పూర్తి చెయ్యలేదు. పైగా ఆయన ఇప్పటివరకు తీసిన మూడు చిత్రాల్లో హీరోయిన్ ని కానీ హీరోని కానీ రిపీట్ చెయ్యలేదు.

Advertisement
 

More

Related Stories