
“పుష్ప 2” సినిమా ఆగస్టు 15న విడుదల అవుతుంది అని నిర్మాతలు చాలా కాలంగా చెప్తున్నారు. అదే టార్గెట్ తో సినిమా షూటింగ్ జరుగుతోంది. ఐతే, ఇటీవల తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రతి సినిమా అనేకసార్లు విడుదల తేదీని మార్చేస్తోంది. అదే పంథాలో “పుష్ప 2” కూడా ఆగస్టు 15న విడుదల కాదు అనే టాక్ వినిపిస్తోంది.
ఎప్పుడైతే “పుష్ప 2” సినిమా కూడా వాయిదా పడే అవకాశం ఉందనే టాక్ మొదలైందో అప్పటి నుంచి ఆ డేట్ ని లాగేసుకునేందుకు ఇతర సినిమాలు ప్రయత్నిస్తున్నాయి.
మరి నిజంగానే ఈ సినిమా ఆగస్టులో విడుదల కాదా? ఇదే ప్రశ్నని సుకుమార్ టీంని అడిగితే అదంతా అబద్దం అని చెప్తోంది. ప్రస్తుతం షూటింగ్ జోరుగా సాగుతోంది. ఇంతకుముందు కొంచెం స్లోగా సాగినా ఇప్పుడు జూన్ లోపు మొత్తం చిత్రీకరణ పూర్తిచేసేలా దూకుడుగా వెళ్తున్నారట. జూన్ చివరి వారంలో కానీ, జులై మొదటి వారంలో కానీ సినిమా షూటింగ్ పూర్తి కావడం ఖాయమని ఈ టీం చెప్తోంది.
జులైనాటికి షూటింగ్ పూర్తి ఐతే విడుదల తేదీ మారే ఛాన్స్ ఉండదు.
ఆగస్టు బదులు డిసెంబర్ లో విడుదల చేస్తే సినిమాకి కలెక్షన్లు బాగుంటాయి అనే వాదన కూడా ఉంది. ఎందుకంటే “పుష్ప” మొదటి భాగం కూడా డిసెంబర్ లో విడుదలై భారీ విజయం సాధించింది. ముఖ్యంగా హిందీ మార్కెట్ కి డిసెంబర్ కరెక్ట్. ఐతే, అంత కాలం వెయిట్ చేస్తే అల్లు అర్జున్ కి చాలా టైం వృధాగా పోతుంది.

అల్లు అర్జున్ మరో రెండు, మూడు ప్రాజెక్టులు సెట్ చేసుకున్నారు. అవి మొదలు కావాలంటే “పుష్ప 2″ని ఆగస్టు 15న విడుదల చెయ్యడమే కరెక్ట్. మరి ఏమి జరుగుతుందో చూడాలి.