
“పుష్ప” సినిమా షూటింగ్ దశలోనే దర్శకుడు సుకుమార్ కి సడెన్ గా ఆలోచన వచ్చింది. ఈ సినిమా కథని ఒక్క భాగంలో చెప్పలేం రెండు భాగాలుగా తీయాలని భావించారు. అలా 70 శాతం షూటింగ్ పూర్తి అయ్యాక రెండో భాగం గురించి ప్రకటించారు. ఇక ఇప్పుడు రెండో భాగం షూటింగ్ జరుగుతోంది.
తాజాగా ఈ రెండో భాగాన్ని కూడా రెండు భాగాలుగా విభజించి “పుష్ప 3” ప్రకటిస్తారు అనేది సోషల్ మీడియా టాక్. “పుష్ప 2” సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే నెట్ ఫ్లిక్స్ సంస్థ ఓటిటి రైట్స్ రికార్డు మొత్తానికి కొనుక్కొంది. ఇక హిందీ మార్కెట్ సహా థియేటర్ హక్కుల ద్వారా ఈ సినిమాకి వచ్చే రెవెన్యూ మామూలుగా ఉండదు. అందుకే, మూడో భాగం కూడా తీస్తే మరింతగా క్యాష్ చేసుకోవచ్చు కదా అని మేకర్స్ భావిస్తున్నారు అని సోషల్ మీడియా మాట.
ఐతే, ఈ విషయంలో టీం మాత్రం మౌనం వహిస్తోంది. మూడో భాగం గురించి మాట్లాడడం లేదు. మరోవైపు, ఇన్ సైడ్ వర్గాలు మూడో భాగం చేసేంత “పుష్ప”లో కథ లేదని చెప్తోంది.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఇంతవరకు 50 శాతం కూడా పూర్తి కాలేదు. ఆగస్టు 15, 2024న విడుదల చేస్తామని ఇంతకుముందు ప్రకటించారు.

కానీ ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం ఈ డేట్ కి సినిమా వర్క్ మొత్తం పూర్తి కావడం కొంచెం కష్టం. అనుకున్న డేట్ కాకుండా డిసెంబర్ లో విడుదల కావొచ్చు.
ఈ సినిమా విడుదల తేదీతో పాటు మూడో భాగం ఉంటుందా ఉండదా అనే విషయంలో క్లారిటీ రావాలంటే మరికొంతకాలం ఆగాలి.