రష్యాలో పుష్ప డకౌట్!


తెలుగు సినిమా ఇప్పుడు ఆస్కార్ రేంజ్ కి చేరుకొంది. ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమాకి ఆస్కార్ నామినేషన్లు వచ్చే అవకాశం ఉంది. ఆ సినిమా జపాన్ లో కూడా బాగా ఆడిందట. అప్పుడెప్పుడో పాతికేళ్ల క్రితం రజినీకాంత్ క్రియేట్ చేసిన రికార్డులను ‘ఆర్ ఆర్ ఆర్’ జపాన్ లో బద్దలుకొట్టిందట.

‘ఆర్ ఆర్ ఆర్’లాగే విదేశాల్లో సత్తా చాటాలని ‘పుష్ప’ కూడా ప్రయత్నించి చతికిలాపడింది. ‘పుష్ప’ సినిమా గత వారం రష్యాలో విడుదలైంది. ఈ సినిమా ప్రమోషన్ కోసం అల్లు అర్జున్, రష్మిక, సుకుమార్, దేవిశ్రీప్రసాద్ …అందరూ వెళ్లి హడావిడి చేశారు. తెగ ప్రోమోట్ చేశారు.

వారం తర్వాత ఈ సినిమా కలెక్షన్లు ఏంటని ఆరా తీస్తే ఎక్కడా ఈ సినిమా గురించి రష్యన్ మీడియాలో ప్రస్తావనే లేదంట. అంటే… అస్సలు ఆడలేదన్నమాట.

మార్కెట్ పెంచుకోవాలన్న మన వాళ్ళ తాపత్రయం మంచిదే కానీ అన్ని సినిమాలు అన్ని మార్కెట్ లో ఆడవు అని కూడా తెలుసుకోవాలి. రెగ్యులర్ గా తెలుగు సినిమాలు బాగా ఆడే అమెరికాలోనే ‘పుష్ప’ ఫ్లాప్ అయింది. ఇక, రష్యాలో ఆడకపోవడంతో వింతేమీ లేదు.

 

More

Related Stories