పుష్ప వెనక్కి తగ్గిందిగా!

Pushpa

‘తగ్గేదే లే’ అనేది అల్లు అర్జున్ డైలాగ్. ‘పుష్ప’ సినిమా టీజర్ లో బాగా స్ట్రైకింగ్ గా నిలిచిన క్యాచీ పదం అది. చిత్తూరు యాసలో బన్నీ చెప్పిన ఈ డైలాగ్ ని పుష్ప టీం తమ సినిమా పబ్లిసిటీకి బాగా వాడుతోంది. సినిమాలో అలా డైలాగ్ చెప్పినా… రియల్ గా మాత్రం పుష్ప వెనక్కి తగ్గింది. ముందు చెప్పిన డేట్ కి రాలేమని ఇప్పుడు పుష్పరాజ్ కి అర్థమైంది. ఈ సినిమా ఆగస్టు 13న విడుదల కావడం లేదు. సినిమా రిలీజ్ వాయిదా పడింది.

ఐతే, ‘పుష్ప’ని ఎప్పుడు విడుదల చెయ్యాలనే విషయంలో క్లారిటీ లేదు. సంక్రాంతి బరిలో నిలపాలని అనుకుంటున్నారు. ఐతే, అప్పటి పరిస్థితిని బట్టి చూస్తారు. ఇప్పటికే సంక్రాంతి 2022 బరిలో మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’, పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ ఉన్నాయి. ఈ రెండిట్లో ఎదో ఒకటి డేట్ మార్చుకుంటేనే ‘పుష్ప’ సంక్రాంతికి రాగలదు. లేదంటే డిసెంబర్ లో రావాలి.

సుకుమార్ డైరెక్షన్లో రూపొందుతోంది ‘పుష్ప’. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఈ సినిమా టీజర్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఒక దశలో ఈ మూవీ షూటింగ్ స్పీడ్ గా సాగుతున్నట్లు అనిపించింది. ఆగస్టు 13నే విడుదల కావడం పక్కా అనిపించింది. ఐతే, సెకండ్ వేవ్ కరోనా కేసులు మొదలయ్యాక అన్ని సినిమాల డేట్స్ మారాయి. షూటింగ్ లు కూడా స్లోగా సాగుతున్నాయి. అందుకే, పుష్ప పంద్రాగస్టు డేట్ కి రాలేక పోతుందట.

More

Related Stories