
అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న “పుష్ప” సినిమాని రెండు భాగాలుగా విడదీశారు. మొదటి భాగాన్ని ఈ ఏడాదే విడుదల చెయ్యాలనేది ప్రయత్నం. ఐతే, దానికి డేట్ ఎప్పుడు కుదురుతుంది అనేది దర్శకుడు సుకుమార్ కి, నిర్మాతలకు తెలియడం లేదు.
సుకుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ బడ్జెట్ కూడా భారీగా పెరిగింది. రెండు భాగాలుగా తీయాలంటే ప్రొడక్షన్ కాస్ట్ పెరుగుతుంది కదా.
ఈ సినిమాకిప్పుడు నేషనల్ లెవల్లో ప్రొమోషన్ కావాలి. ఒక్కసారి రిలీజ్ డేట్ ఫిక్స్ అయితే ఆ పని మీదే ఉంటారు. ఈ గ్యాప్లో టీజర్ కి 100 మిలియన్ల వ్యూస్ వచ్చేలా టార్గెట్ పెట్టుకున్నారట. ఇప్పటికే ఈ సినిమా టీజర్ కి 70 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. 70 మిలియన్ల వ్యూస్ పొందిన టీజర్ తెలుగులో మొదటిది ఇదే.
రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ మొదటి భాగానికి సంబంధించి ఇంకా 40 రోజుల చిత్రీకరణ మిగిలి ఉంది. ఫహద్ ఫాజిల్ ఈ సినిమాలో మెయిన్ విలన్. అతను ఇంకా పూర్తి స్థాయిలో షూటింగ్ లో పాల్గొనలేదు.