పుష్ప వల్లే నష్టాలే వచ్చాయి: తేజ

Teja


అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ పాన్ ఇండియా లెవెల్లో హిట్. హిందీలో బాగా ఆడిన మాట వాస్తవం. ఐతే, తెలుగునాట ఇది పెద్దగా ఆడలేదు. ఆ విషయాన్ని తేజ కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.

దర్శకుడు తేజ ఆంధ్రజ్యోతికి ఇచ్చిన ఇంటర్వ్యూలో పాన్ ఇండియా చిత్రాల గురించి మాట్లాడారు. చాలా మంది అనుకుంటున్నట్లు పుష్ప తెలుగులో పెద్ద హిట్ కాదు అని తేల్చి చెప్పారు. చాలామంది థియేటర్ల ఓనర్లకు డబ్బులు రాలేదట. తేజకి కూడా థియేటర్ల బిజినెస్ ఉంది. సినిమా వ్యాపార లావాదేవీలు బాగా తెలుసు. అట్టర్ ప్లాఫ్ అయిన రాధేశ్యామ్ కొన్ని చోట్లా లాభాలు చూపిందట. ఇది తేజ మాట.

తేజ చాలా గ్యాప్ తర్వాత ఒక సినిమా తీశారు. అదే అహింస. ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఆయన సినిమాల గురించి తన అభిప్రాయం చెప్పారు.

మరి తేజ మాటలతో అల్లు అర్జున్, ఆయన అభిమానులు ఎలా స్పందిస్తారో చూడాలి. అల్లు అర్జున్ ఇప్పుడు ‘పుష్ప 2’ కోసం సిద్ధం అవుతున్నారు.

 

More

Related Stories