
అనుకున్నదే జరిగింది. ‘పుష్ప’ పాన్ ఇండియా రిలీజ్ కి అనేక సమస్యలు ఎదుర్కొంటోంది. తెలుగు మార్కెట్ తర్వాత అల్లు అర్జున్ కి బాగా పట్టు ఉన్న రాష్ట్రం కేరళ. పైగా, ‘పుష్ప’లో కీలక పాత్రలో నటించింది మలయాళం సూపర్ స్టార్ ఫహద్ ఫాజిల్. కానీ, అక్కడే టైంకి విడుదల కావడం లేదు.
మలయాళం వర్షన్ … డిసెంబర్ 17న విడుదల కావడం లేదు. ఈ సినిమా ఒక రోజు లేట్ గా అంటే శనివారం విడుదల కానుంది. తమిళం, హిందీ, కన్నడ కూడా డిసెంబర్ 17నే రిలీజ్ కానుండగా మలయాళం మాత్రం డిసెంబర్ 18న రానుంది.
“సాంకేతిక కారణాల వల్ల సినిమా రిలీజ్ లేట్ అవుతోంది. డిసెంబర్ 17న కేరళలోని థియేటర్లలో తమిళ్ వర్షన్ ప్రదర్శిస్తాం. శనివారం నుంచి మలయాళంలో నడుస్తుంది,” అని కేరళ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ప్రకటించింది. మిక్సింగ్, డబ్బింగ్ వంటి అన్ని పనులు చివరి నిమిషం వరకు హడావిడిగా జరిగాయి. దర్శకుడు సుకుమార్ డే అండ్ నైట్ వర్క్ చేసి అనుకున్న డేట్ కి తెస్తున్నారు. ఐతే, ఆ క్రమంలో ఎన్నో అడ్డంకులు.
ఈ సినిమాకి చాలా హైప్ వచ్చింది. టికెట్ ల కోసం జనం ఎగబడుతున్నారు. కానీ, ఈ హడావిడి, అయోమయం వల్ల ఇలా మంచి రెవెన్యూని పోగొట్టుకున్నారు. “పాన్ ఇండియా” సినిమాని ఇలా మాత్రం విడుదల చెయ్యకూడదు. విడుదలకు కనీసం నెల రోజుల ముందు అన్ని పనులు పూర్తి కావాలి.