థియేటర్లో ఉండగానే అమెజాన్లోకి వచ్చింది

- Advertisement -
Pushpa

అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ ఇంకా థియేటర్లలో నడుస్తోంది. దానికి టైం కలిసొచ్చింది. పెద్ద సినిమాలన్నీ వాయిదా పడడం, విడుదలైన ఇతర సినిమాలేవీ పోటీ ఇవ్వలేకపోవడంతో ‘పుష్ప’ ఇంకా థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ‘రాధేశ్యామ్’ కూడా సంక్రాంతి రేస్ నుంచి తప్పుకొంది. దాంతో, ‘పుష్ప’కి మరో 10 రోజులు రన్ ఉండే ఛాన్స్ ఉంది.

కానీ, అప్పుడే అమెజాన్ ప్రైమ్ ఓటిటిలో విడుదల చేస్తోంది. జనవరి 7 నుంచి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. హిందీ రైట్స్ ఇంకా అమ్మలేదు.

‘పుష్ప’ రెండు వారాలకు మించి ఆడదనే గట్టి నమ్మకంతో నిర్మాతలు మూడో వారం నుంచే ఓటిటిలో స్ట్రీమ్ చేసుకునే విధంగా రిలీజ్ కి ముందు ఒప్పందం చేసుకున్నారు. జనవరి 7 నుంచి థియేటర్లలో “ఆర్ ఆర్ ఆర్” ఆక్రమిస్తుంది అని భావించారు. కానీ, రాజమౌళి సినిమా వాయిదాపడింది. అదృష్టం బాగుండి ఈ సినిమాకి ఇంకా థియేటర్లలో కలెక్షన్ కనిపిస్తోంది. దాంతో, నిర్మాతలు చేసేది ఏమి లేక సైలెంట్ అయిపోయారు.

మరి ఇప్పుడు ఫ్రీగా ప్రైమ్ లో వస్తున్నప్పుడు థియేటర్ కి వెళ్లి జనం ‘పుష్ప’ని చూస్తారా లేదా అన్నది చూడాలి.

 

More

Related Stories