
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తీస్తున్న ‘పుష్ప’ షూటింగ్ జోరుగా సాగుతోంది. ఇండియా అంతా కరోనా సెకండ్ వేవ్ భయం గుప్పిట్లో ఉంది. సుకుమార్ మాత్రం గ్యాప్ తీసుకోకుండా షూటింగ్ చేస్తున్నారు. జనరల్ గా సుకుమార్ అవకాశం దొరికితే షూటింగ్ కి ప్యాకప్ చెప్పి ‘కొత్త సీన్ల కోసం థింక్’ చేస్తాడనే అపవాదు వుంది. దానికి భిన్నంగా కరోనా విలయతాండవం చేస్తున్న టైంలో షూటింగ్ ని కాల్ ఆఫ్ చెయ్యట్లేదు.
దీనికి కారణం… విలన్ పాత్ర పోషిస్తున్న ఫహద్ ఫాజిల్. మలయాళంలో టాప్ మోస్ట్ హీరో అతను. గతేడాది లాక్డౌన్ లో కూడా మూడు సినిమాల షూటింగ్స్ పూర్తి చేసి, వాటిని ఓటిటిలో విడుదల చేశాడు. ఏడాదికి మినిమమ్ మూడు, నాలుగు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉండే స్టార్ ఫహద్ ఫాజిల్. ఆయన డేట్స్ దొరకడం కష్టం.
ఏప్రిల్ మూడో వారం నుంచి ‘పుష్ప’కి డేట్స్ కేటాయించాడు ఫహద్. ఇప్పుడు ఆ డేట్స్ వేస్ట్ చేసుకుంటే… మళ్ళీ దొరకపట్టడం కష్టం అని సుకుమార్ కి తెలుసు. అందుకే వారం రోజులుగా నాన్ స్టాప్ గా ఫహద్ కి చెందిన సీన్లు కొన్ని తీస్తున్నారు.
ఈ కరోనా కాలంలో ‘పుష్ప’ షూటింగ్ ఎందుకు ఆగట్లేదు అంటే… రీజన్ అదే.