బన్నీ, సుక్కు ఐసోలేషన్ కెళ్లాల్సిందే!

- Advertisement -
Allu Arjun and Sukumar

పుష్ప టీంకి కరోనా షాక్ తగిలింది. ఆంధ్రప్రదేశ్ లోని మారేడుమిల్లి అడవుల్లో పుష్ప షూటింగ్ జరుగుతుండగా… ప్రొడక్షన్ టీంలో పనిచేసే ఒక వ్యక్తి చనిపోయారు. ఇప్పుడు ఎవరు చనిపోయినా కరోనా టెస్ట్ చేస్తున్నారు కదా! అలా ఆ చనిపోయిన ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ కి కూడా చేయగా, అతనికి కరోనా అని తేలింది. దాంతో టీం మొత్తం హడావిడిగా టెస్ట్ చేయించుకొంది. ఇప్పటికే 20 మందికి కరోనా సోకినట్లు తేలింది.

దాంతో షూటింగ్ ని రద్దు చేసి హైదరాబాద్ కి వచ్చింది పుష్ప టీం. ఇంకా ఇంతమందికి కరోనా వస్తుందో తెలియదు. మరో వారం, పది రోజుల వరకు లక్షణాలు బయటపడవు. అల్లు అర్జున్ కొంత వరకు సేఫ్. ఆ టీం మెంబర్ బన్నీతో ఇంటరాక్షన్ జరగలేదట. కానీ సుకుమార్, ఇతర మెయిన్ టీం అంతా ఇప్పుడు ఐసోలేషన్ లోకి వెళ్ళాలి. వారం పాటు ఎవరిని కలవొద్దు.

పుష్ప” టీంకి ఇది పెద్ద షాక్. ఇప్పటికే ఒక పాట, కొన్ని యాక్షన్ సీన్లు తీశారు అక్కడ. మళ్ళీ కొత్త షెడ్యూలు ఎప్పుడు, ఎక్కడ మొదలు పెట్టాలి అనేది ఇంకా నిర్ణయించుకోలేరు.

 

More

Related Stories