అల్లు అర్జున్ టీజర్ కి కూడా కొన్నారట

Pushpa

ఇటీవల టీజర్లకు, ట్రైలర్లకు వ్యూస్ కొనడం అనేది కామన్ గా మారిపోయింది. ఫస్ట్ డే మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చాయి అని చూపించుకోవాలంటే వ్యూస్ కొనుక్కునే మార్కెటింగ్ ట్రిక్కులు తప్పవట. ఆ తర్వాత జనాలకు నచ్చితే అది వైరల్ అవుతుంది. రీసెంట్ గా విడుదలైన బాలయ్య మూవీ ‘అఖండ’ టైటిల్ టీజర్ 47 మిలియన్ల వ్యూస్ అందుకొంది. ఈ టీం కూడా మార్కెటింగ్ ట్రిక్స్ వాడింది అని ఆరోపణలున్నాయి. ఐతే, ఇది వైరల్ అయిందనేది కూడా వాస్తవమే.

బాలయ్య సినిమా 50 మిలియన్ల వ్యూస్ దగ్గరికి రావడంతో అర్జెంట్ గా “పుష్ప” టీజర్ కి కూడా వ్యూస్ కొన్నారని గుస గుసలు వినిపిస్తున్నాయి. ‘పుష్ప’ టీజర్ చాలా రోజులుగా 45 మిలియన్ల వ్యూస్ దగ్గర తచ్చాడుతోంది. కానీ రెండు రోజుల్లోనే 50 మిలియన్ల వ్యూస్ దాటింది. దాని వెనుక ఈ ‘కొనడం’ అనే ట్రిక్ ఉందని అంటున్నారు.

పెద్ద హీరోల సినిమాలకు ఇలాంటి ‘రికార్డు’ల తిప్పలు తప్పవేమో.

More

Related Stories