
‘పుష్ప’ సినిమాలో హీరో, హీరోయిన్ మధ్య రొమాంటిక్ సన్నివేశాలు కొంత డిఫెరెంట్ గా ఉన్నాయనే చెప్పొచ్చు. కొన్ని సీన్లు మంచి కామెడీ పండించాయి. అలాగే, కొన్ని ఇబ్బందికరంగా అనిపించాయి. అలా వాటిలో ఒకటి… ‘టిఫిన్’ సీన్.
హీరో తన మారుతి కార్లో కూర్చొని ఉంటాడు. అతనికి తన వీపు ఆనించి హీరోయిన్ కూర్చుంటుంది. హీరో ఆమె భుజం మీద నుంచి చెయ్యి వేస్తాడు. ఆమె ‘అక్కడి నుంచి’ చెయ్యి తీయమని చెప్తుంటుంది. అతను తియ్యడు. అతను ఎక్కడ చెయ్యి వేశాడో, ఏమి చేస్తున్నాడో జనాలకు అర్థం అయ్యేలా ఉంటుంది సీన్.
ఇంకా ఎవరికైనా అర్థం కాదని కాబోలు, హీరోయిన్ కారులోనుంచి బయటికి వచ్చాక హీరోయిన్ ఫ్రెండ్ ఒక డైలాగ్ చెప్తుంది. హీరోయిన్ తల్లి హీరోని ఇంట్లోకి వచ్చి టిఫిన్ చేసి వెళ్ళమని అడిగిన వెంటన్ ఆ హీరోయిన్ ఫ్రెండ్ ఇప్పుడే ‘టిఫిన్’ చేశాడులే అంటుంది. సో… కారులో ఏమి జరిగిందో అర్థం కానీ వాళ్ళకి కూడా తెలిసేలా ఆ డైలాగ్ ఉంటుంది. ఐతే, విమర్శల నేపథ్యంలో ఆ సన్నివేశాన్ని ఇప్పుడు సినిమాలో నుంచి తొలిగించాలని నిర్ణయించారట.
సుకుమార్ సినిమా అంటే పిల్లలతో థియేటర్లకు వస్తారు ప్రేక్షకులు. ఐతే, ఫ్యామిలీ ఆడియెన్స్ కి ఇది ఇబ్బంది అని తొలగించారట.