
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ రూపొందిస్తున్న “పుష్ప” సినిమా శేషాచలం ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో సాగే కథ. తిరుపతి సమీపంలోని అడవుల్లో సాగే ఎర్రచందనం స్మగ్లింగ్ ఈ సినిమా కథకి కీలకమైన పాయింట్. ఐతే, అక్కడ షూటింగ్ చెయ్యలేక, అంతే దట్టమైన మారేడుమిల్లి, రంపచోడవరం అడవులను సెలెక్ట్ చేసుకున్నాడు దర్శకుడు సుకుమార్. తూర్పు గోదావరి జిల్లాలోని ఈ అడవుల్లో రెండు షెడ్యూల్స్ పూర్తి చేశారు.
నవంబర్లో మొదటిసారి, తాజాగా సంక్రాంతి నుంచి ఫిబ్రవరి మొదటివారం వరకు కీలకమైన సీన్లు తీశారు. దాంతో ఈ అడవులకు సంబందించిన వర్క్ పూర్తి అయింది.
షూటింగ్ కి సహకరించిన అక్కడి గిరిజనులకు, ప్రభుత్వానికి, అధికారులకు నిర్మాతలు థాంక్స్ చెప్పారు.
“పుష్ప” షూటింగ్ ఇకపై హైదరాబాద్ లోను, కేరళ, థాయిలాండ్ లో జరగనుంది. ఆగస్టు 13న ఈ మూవీ విడుదల కానుంది. ఈ డేట్ మిస్ కావొద్దని అల్లు అర్జున్ ప్రయత్నిస్తున్నాడు. మరి సుకుమార్ అంత స్పీడ్ గా పూర్తి చేయగలడా అన్న డౌట్స్ మాత్రం ఉన్నాయి.
ఒకేసారి తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానున్న పాన్ ఇండియా మూవీ ఇది. రష్మిక హీరోయిన్.