‘పుష్ప 2’లో ఇంకో భామ!?

- Advertisement -
Pushpa


‘పుష్ప’ సినిమా తెలుగులో కన్నా హిందీ మార్కెట్ లో మంచి విజయం సాధించింది. హిందీ మార్కెట్లో పట్టు కావాలని ఏదైతే అనుకున్నాడో అది సాధించాడు హీరో అల్లు అర్జున్. ఆంధ్రాలో సినిమా నష్టాలు చూసినా… తాను కోరుకున్న హిందీలో వర్కౌట్ అయింది అని బన్నీ ఉత్సాహంగా ఉల్లాసంగా ఉన్నాడు.

అందుకే, రెండో పార్టు ఆలస్యం చేయకుండా మొదలు పెట్టాలని ఉరుకులు పరుగులు పెడుతున్నాడు. దర్శకుడు సుకుమార్ కూడా సమాయత్తమవుతున్నారు. సంక్రాంతి పండుగ అయిపోగానే స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు చెయ్యడం షురూ చేస్తారట.

‘పుష్ప 2’లో మరో హీరోయిన్ కి ఛాన్స్ ఉంది అని టాక్. మొదటి భాగంలో హీరో అల్లు అర్జున్ కి రష్మికతో పెళ్లి అయిందని చూపించారు. పెళ్లి సీన్ తో సినిమా ఎండ్ అయింది. మరి, రెండో భాగంలో ‘రొమాన్స్’కి స్కోప్ తగ్గుతుంది కదా. అందుకని, మరింత మసాలా కోసం ఇంకో పాత్రని సృష్టిస్తారని ప్రచారం జరుగుతోంది.

ఐతే, దర్శకుడు సుకుమార్ మాత్రం అలాంటిది లేదని చెప్తున్నారు. మొదటి భాగంలో బతికున్న పాత్రలే మళ్ళీ రెండో దాంట్లోనూ ఉంటాయి. కథ ఇప్పటికే రాసుకున్నదే. కాకపొతే, కొన్ని కొత్త పాత్రలు మాత్రం యాడ్ అవుతాయని చెప్తున్నారు సుకుమార్. రెండో భాగంలో ఫహద్ ఫాజిల్, అనసూయ వంటి పాత్రలు ఎక్కువ డామినేట్ చేస్తాయట .

హీరో అల్లు అర్జున్, రష్మిక మధ్య ట్రాక్ రెండో భాగంలో కూడా ఉంటుండి. భార్యాభర్తల మధ్య ఉండే సరసం ఉంటుంది ఇందులో. హీరోకి రెండో భార్య లేదా లవర్ వంటి ట్రాక్ లేదని చెప్తున్నారు. మొదటి భాగంలో సమంత ఐటెం సాంగ్ చేసింది. రెండో పార్ట్ లో ఆమెకి స్కోప్ లేదు. ఐతే, మరో ఐటెం గర్ల్ కూడా ఉంటుంది.

 

More

Related Stories