హిందీలో ‘పుష్పక విమానం’ రీమేక్!

- Advertisement -
Pushpaka Vimanam Trailer

ఆనంద్ దేవరకొండ నటించిన “పుష్పక విమానం” మెయిన్ పాయింట్ బాగుంది అని పలువురు క్రిటిక్స్ తమ రివ్యూస్ లో రాశారు. క్రైం, కామెడీ కలిసిన కథ. ఈ సినిమాని ఇప్పుడు హిందీలో రీమేక్ చేస్తామని మూడు సంస్థలు ఆసక్తి చూపుతున్నాయట.

హిందీ రీమేక్ రైట్స్ కోసం మంచి డిమాండ్ ఏర్పడింది అని అంటున్నారు. బాలీవుడ్ కి చెందిన మూడు ప్రముఖ నిర్మాణ సంస్థలు ఇప్పటికే నిర్మాతలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. బాలీవుడ్ లో ఇలాంటి కాన్సెప్ట్ సినిమాలకు మంచి ఆదరణ ఉంటుంది. అందుకే, ‘పుష్పక విమానం’ సినిమాని హిందీ రీమేక్ కోసం పోటీ ఉంది.

ఏ సంస్థ తీసుకుందనే విషయాన్ని త్వరలోనే చెప్తామని ఎక్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అనురాగ్ పర్వతనేని తెలిపారు. ప్రస్తుతం థియేటర్లలో నడుస్తోన్న “పుష్పక విమానం” ఆనంద్ దేవరకొండకి మూడో చిత్రం.

కొత్త దర్శకుడు తీసిన ఈ సినిమాలో గీత్, మేఘన హీరోయిన్లుగా నటించారు.

 

More

Related Stories