అమ్మని కలవలేకపోయిన చిరు

- Advertisement -
Chiranjeevi


మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం క్వారెంటైన్ లో ఉన్నారు. కరోనా బారిన పడడడంతో ఆయన ఇంట్లోనే ఐసోలేషన్ లో ఉంటున్నారు. అందుకే తన తల్లి అంజనాదేవికి కలవలేకపోయినట్లు చిరంజీవి తెలిపారు.

నేడు మెగాస్టార్ చిరంజీవి తల్లి పుట్టిన రోజు. ఆమె పుట్టిన రోజునాడు ప్రత్యక్షంగా కలిసి శుభాకాంక్షలు తెలపలేకపోయిన చిరంజీవి బాధపడుతున్నారు.

“అమ్మా ! జన్మదిన శుభాకాంక్షలు. క్వరెంటైన్ అయిన కారణంగా నీ ఆశీస్సులు ప్రత్యక్షంగా తీసుకోలేక ఇలా తెలుపుతున్నా… నీ చల్లని దీవెనలు ఈ జన్మకే కాదు మరు జన్మలకి కూడా కావాలని ఆ భగవంతుడ్ని కోరుకొంటూ అభినందనలతో …. శంకరబాబు,” అని తల్లికి ట్విట్టర్ ద్వారా విషెస్ చెప్పారు మెగాస్టార్.

అంజనాదేవికి ఇద్దరు కూతుళ్లు, ముగ్గురు కొడుకులు. చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ హీరోలుగా స్థిరపడ్డారు. ఆమె మనవళ్లు కూడా పాపులర్ హీరోలే.

 

More

Related Stories