ఫైట్ సీన్లో లక్ష్మీకి ప్రమాదం

- Advertisement -
Raai Lakshmi

‌గ్లామర్ భామ రాయ్ లక్ష్మి పెద్ద ప్రమాదం నుంచి తృటిలో బయటపడింది. రాయ్‌లక్ష్మీ ప్రధాన పాత్రలో ఒక తెలుగు సినిమా రూపొందుతోంది. రోచిశ్రీ మూవీస్‌ నిర్మాణంలో రమణ మొగిలి దర్శకత్వం వహిస్తున్నాడు. హైదరాబాద్ లో అండర్‌వాటర్ ఫైట్ కి సంబంధించి యాక్షన్ సన్నివేశాలు తీస్తుండగా ప్రమాదం జరిగింది. లక్ష్మీరాయ్‌కి కాలుకి గాయమైంది. వెంటనే ఆమెని ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు.

ఇప్పుడు ఆమె కోలుకుంటున్నారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయింది. త్వరలోనే ఆమె చిత్రీకరణలో కూడా పాల్గొంటుందట.

రాయ్ లక్ష్మి గ్లామర్ పాత్రలకు, ఐటెం సాంగ్స్ కి పాపులర్. ఐతే, ఇప్పుడు యాక్షన్ రోల్స్ కూడా చేస్తోంది.

More

Related Stories