వెబ్ సిరీస్ లోకి హిట్ హీరోయిన్ రాశి ఖన్నా

raashi khanna web series

సినిమాల్లో సక్సెస్ ఫుల్ గా రాణిస్తున్న వాళ్లు వెబ్ సిరీస్ చేయాలని అనుకోరు. తొలి ప్రాధాన్యం సినిమాకే ఇస్తారు. కానీ రాశి ఖన్నా మాత్రం డిఫరెంట్. ఓ వైపు సినిమా ఆఫర్లు వస్తున్నప్పటికీ.. చేతిలో “ప్రతిరోజూ పండగే” లాంటి హిట్ ఉన్నప్పటికీ ఆమె వెబ్ సిరీస్ వైపు అడుగులు వేసింది.

ఓ వెబ్ సిరీస్ ఐడియా తనకు బాగా నచ్చిందంటోంది రాశిఖన్నా. ఎంతలా అంటే ఆ వెబ్  సిరీస్ కోసం అవసరమైతే ఎన్ని కాల్షీట్లు ఇవ్వడానికైనా రెడీ అయింది. ప్రస్తుతం ఆ వెబ్ సిరీస్ ప్రీ-ప్రొడక్షన్ స్టేజ్ లో ఉందని.. అందులో నటించడం కోసం చాలా ఇంట్రెస్టింగ్ గా ఎదురుచూస్తున్నట్టు తెలిపింది.

మరోవైపు సినిమాల గురించి స్పందిస్తూ.. 2 తెలుగు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చానని, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో వాటిని తను బయటపెట్టడం కరెక్ట్ కాదంటోంది. లాక్ డౌన్ వల్ల ఇండస్ట్రీలో చాలా సమీకరణాలు మారిపోతున్నాయని.. కాబట్టి తను ఒప్పుకున్న సినిమాల్ని మేకర్స్ ఎనౌన్స్ చేస్తేనే బాగుంటుందని చెబుతోంది. 

Related Stories