ఆ రెండూ చేజారాయి!

లాక్ డౌన్ తర్వాత రెండు భారీ ప్రాజెక్టులు ప్రకటిస్తానని ఊరించింది రాశిఖన్నా. ఆ రెండు ప్రాజెక్టులకు సంబంధించి లీకులు కూడా వచ్చాయి. కానీ ఏ ఒక్క దాంట్లో ఆమె లేకుండా పోయింది.

అజయ్ భూపతి దర్శకత్వంలో వస్తున్న “మహాసముద్రం” సినిమాలో రాశిఖన్నాను తీసుకుంటున్నట్టు జోరుగా ప్రచారం నడిచింది. కట్ చేస్తే, ఆ సినిమాలో ఆమె లేదు. ఇక రమేష్ వర్మ-రవితేజ కాంబినేషన్ లో వస్తున్న “ఖిలాడీ” సినిమాలో కూడా రాశిఖన్నా పేరు వినిపించింది. ఈ ప్రాజెక్టులో కూడా ఈమె లేదనే విషయం తాజాగా నిర్థారణ అయింది.

అలా తను ప్రకటించాలనుకున్న 2 ప్రాజెక్టులు చేజారిపోవడంతో రాశిఖన్నా ఇప్పుడు కోలీవుడ్ పై దృష్టి పెట్టింది. విజయ్ సేతుపతి సరసన మరోసారి నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Raashi Khanna

“వరల్డ్ ఫేమస్ లవర్” సినిమాలో బోల్డ్ గా నటించింది రాశిఖన్నా. అందులో ఆమె కొన్ని ఇంటిమసీ సీన్స్ కూడా చేసింది. ఆ సన్నివేశాల ప్రభావం, రాశిఖన్నా కెరీర్ పై పడిందని అంటున్నారు చాలామంది. అలాంటి బోల్డ్ సీన్స్ చేయడం వల్ల ఆమెకు కొన్ని సాఫ్ట్ క్యారెక్టర్లు ఇవ్వడానికి మేకర్స్, ఆమెతో నటించడానికి కొంతమంది హీరోలు వెనకాడుతున్నారని టాక్. ఇందులో నిజమెంతో?

Related Stories