ఈ దీపావళికి అవన్నీ మిస్!

Raashi Khanna

వెలుగుల పండగ. అంతా ఆనందంగా ఉండాల్సిన రోజు. కానీ హీరోయిన్ రాశిఖన్నా మాత్రం చాలా బాధ పడుతోంది. దీనికి కారణం ఆమె తన పేరెంట్స్ ను మిస్ అవ్వడమే. ఫస్ట్ టైమ్ దీపావళి రోజున తల్లిదండ్రులకు దూరంగా ఉండాల్సి వస్తోందని బాధగా చెబుతోంది రాశిఖన్నా.

ప్రస్తుతం చెన్నైలో ఉన్న ఈ ముద్దుగుమ్మ, చెన్నైలోనే దీపావళిని సింగిల్ గా జరుపుకుంటానని చెబుతోంది.

నిజానికి ఆమె చేస్తున్న సినిమాకు బ్రేక్ ఇచ్చారు. యూనిట్ మొత్తం దీపావళికి హాలిడే తీసుకుంది. కావాలనుకుంటే రాశి కూడా తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లొచ్చు. కానీ ఈ కరోనా పరిస్థితుల్లో తను విమాన ప్రయాణం చేసి, తల్లిదండ్రుల్ని రిస్క్ లో పెట్టలేనంటోంది రాశి. అందుకే దీపావళిని వాళ్లకు దూరంగా సెలబ్రేట్ చేసుకుంటున్నానని, వాళ్లలో వీడియో కాల్ లో మాట్లాడతానని చెబుతోంది.

ఏటా లక్ష్మీపూజ, గణపతి పూజతో తన ఇంట్లో దీపావళి సంబరం స్టార్ట్ అవుతుందని, ఆ తర్వాత అమ్మ చేసిన పాయసంతో ఆనందం రెట్టింపు అవుతుందని చెబుతున్న రాశిఖన్నా.. ఈ ఏడాది అవన్నీ మిస్సవుతున్నానని అంటోంది.

Related Stories