మరోసారి గిటార్ అందుకుంది

Raashi Khanna

ఈ లాక్ డౌన్ టైమ్ లో గిటార్ నేర్చుకుంటానని చెప్పిన రాశీఖన్నా.. చెప్పినట్టుగానే గిటార్ నేర్చుకుంది. తన ప్రావీణ్యాన్ని ఇప్పటికే ఓసారి ప్రదర్శించింది. గిటార్ పై ఏకంగా ఓ ఇంగ్లిష్ సాంగ్ పాడింది. ఇప్పుడు మరోసారి తన గిటార్ ప్రావీణ్యాన్ని చూపించింది ఈ ముద్దుగుమ్మ. “హుషారు” సినిమాలో సిద్ శ్రీరామ్ పాడిన ఉండిపోరాదే పాటను పాడి ఆలపించింది రాశిఖన్నా.

“పాడడం నాకు ఇష్టమైన పని. ఇక ఈ పాట నాకిష్టమైన తెలుగు పాటల్లో ఒకటి. ఈ మ్యూజిక్, సిద్ శ్రీరామ్ గొంతు ఎప్పుడూ నాకు ఆనందాన్నిస్తాయి. అందుకే ఈ పాటను పాడాలని నిర్ణయించుకున్నాను.” ఇలా ఓ పోస్ట్ పెట్టి మరీ పాటకు సంబంధించిన వీడియోను రిలీజ్ చేసింది రాశిఖన్నా.

ఈ ఏడాది రాశి ఖన్నా నుంచి “వరల్డ్ ఫేమస్ లవర్” సినిమా రిలీజైంది. త్వరలోనే ఆమె తన కొత్త సినిమాల్ని ప్రకటించబోతోంది. రవితేజ-రమేష్ వర్మ కాంబోలో రాబోతున్న సినిమాతో పాటు.. అజయ్ భూపతి డైరక్ట్ చేయబోతున్న “మహాసముద్రం” ప్రాజెక్టుల్లో రాశిఖన్నా నటించే ఛాన్స్ ఉంది.

Related Stories