రాశి ఖన్నాముద్దులు… హద్దులు!


రాశి ఖన్నా, నాగ చైతన్య నటించిన ‘థాంక్యూ’ చిత్రంలో రొమాన్స్ మెయిన్ హైలెట్ కానుందట. ముఖ్యంగా నాగ చైతన్య, రాశి మధ్య ముద్దు సీన్లు ఓ రేంజులో ఉన్నాయని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఆమె ఇప్పటికే పలు సినిమాల్లో ముద్దు సీన్లలో నటించింది. ఐతే, ఈ సినిమాలో చైతన్యతో ఆమె కెమిస్ట్రీ అదిరింది అని టాక్.

“ముద్దు సీన్లకు నేను వ్యతిరేకం కాదు. రొమాంటిక్ సన్నివేశాల్లో అవి సహజం. ఐతే, అందరూ ఊహించుకున్నట్లు ‘థాంక్యూ’లో అవి అతిగా ఉండవు. ఇప్పటివరకు నేను చేసిన ఇతర సినిమాల్లో మాదిరే ఉన్నాయి. హాట్ హాట్ గా ఉన్నాయి అని చేస్తున్న ప్రచారం తప్పు,” అని క్లారిటీ ఇచ్చింది ఈ భామ.

ముద్దు సీన్లలో హద్దుల నిర్ణయం జరిగిందా? “రొమాన్స్ కి, వల్గారిటీకి మధ్య గీత ఉంది. ఆ హద్దు దాటను,” అని చెప్తోంది రాశి ఖన్నా.

Raashi Khanna and Naga Chaitanya

రాశిఖన్నా ఇప్పటికే నాగ చైతన్యతో ‘వెంకీమామ’లో నటించింది. వీరి మధ్య మంచి స్నేహం ఉంది. అందుకే, కెమిస్ట్రీ కూడా బాగా పండింది.

 

More

Related Stories