తండ్రికి గిటార్ నేర్పిన రాశి

raashi khanna guitar

ఈ లాక్ డౌన్ టైమ్ లోనే గిటార్ నేర్చుకుంది రాశిఖన్నా. రెండు సందర్భాల్లో పాటలు పాడి తన టాలెంట్ కూడా చూపించింది. అలా ఇప్పుడిప్పుడే గిటార్ నేర్చుకుంటున్న రాశిఖన్నా, ఈసారి ఏకంగా తన తండ్రికే అందులో పాఠాలు చెప్పేస్తోంది.

మరీ సీరియస్ గా కాదు కానీ, తండ్రికి సరదాగా గిటార్ నేర్పించే ఫొటోల్ని రాశిఖన్నా పోస్ట్ చేసింది. తండ్రి వాయిస్తుంటే పొంగిపోయి, అతడి బుగ్గను కూడా గిల్లింది.

ప్రస్తుతం సినిమాలకు కాల్షీట్లు ఇస్తూనే వెబ్ సిరీస్ లో కూడా నటించడానికి రెడీ అవుతోంది రాశిఖన్నా. ఓ వెబ్ సిరీస్ ఐడియా తనకు బాగా నచ్చిందంటోంది రాశిఖన్నా. ఎంతలా అంటే ఆ వెబ్  సిరీస్ కోసం అవసరమైతే ఎన్ని కాల్షీట్లు ఇవ్వడానికైనా రెడీ అయింది. ప్రస్తుతం ఆ వెబ్ సిరీస్ ప్రీ-ప్రొడక్షన్ స్టేజ్ లో ఉందని.. అందులో నటించడం కోసం చాలా ఇంట్రెస్టింగ్ గా ఎదురుచూస్తున్నట్టు తెలిపింది.

Related Stories