- Advertisement -

రాశి ఖన్నాకి ఇప్పుడు తెలుగులో కన్నా ఇతర భాషల్లో ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి. తమిళం, హిందీ, మలయాళం భాషల్లో బిజీ అవుతోంది. హిందీలో షాహిద్ కపూర్ సరసన ఒక వెబ్ డ్రామాలో నటిస్తోంది. తమిళంలో రెండు సినిమాలు చేస్తోంది. లేటెస్ట్ గా మలయాళంలో పృథ్విరాజ్ సుకుమారన్ సరసన నటిస్తోంది.
హిందీలో సూపర్ హిట్టైన అంధధూన్ రీమేక్ ఇది. బాలీవుడ్ లో రాధికా ఆప్టే చేసిన పాత్రలో రాశి ఖన్నా కనిపిస్తుంది.
ఆ మధ్య తెలుగులో అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని హైదరాబాద్ లో ఇల్లు తీసుకొంది రాశి ఖన్నా. కానీ పాపం ఎందుకో తెలుగులో మాత్రం ఇప్పుడు అవకాశాలు తక్కువగా వస్తున్నాయి. ఇతర భాషల్లోనే ఆమె కెరీర్ బాగుంది.