
‘ది ఫ్యామిలీ మేన్ 2’ వెబ్ సిరీస్ బాగా క్లిక్ అయింది. దాంతో ఇప్పుడు అందరి చూపు అటువైపు పడింది. అలాగే ఈ సిరీస్ లో రాజీ అనే పాత్రలో సమంత అదరగొట్టింది. దాంతో, హిందీ వెబ్ సిరీస్ ల కోసం సౌత్ హీరోయిన్లను తీసుకుంటుంటారు. త్వరలోనే మొదలు కానున్న హిందీ వెబ్ సిరీస్ లో రాశి ఖన్నా నటించనుందట.
అజయ్ దేవగన్ హీరోగా రూపొందనున్న ‘రుద్ర’ అనే వెబ్ సిరీస్ ని బీబీసీ స్టూడియో నిర్మించనుంది. ‘లూథర్’ అనే ఇంటెర్నేషనల్ వెబ్ సిరీస్ కి ఇది రీమేక్. అజయ్ దేవగన్ పోలీస్ ఆఫీసర్ గా నటించే ఈ సిరీస్ లో హీరోయిన్ గా రాశి ఖన్నాని సెలెక్ట్ చేశారు. ఆమె కూడా పోలీస్ అధికారిణిగానే కనిపించనుంది.
మొత్తానికి రాశి ఖన్నా కూడా హీరోయిన్ గా బిజీ అవుతోంది. ఆమె ప్రస్తుతం నాగ చైతన్య సరసన ‘థాంక్యూ’ సినిమాలో నటిస్తోంది. అలాగే, కార్తీ సరసన ‘సర్దార్’ అనే మూవీ కూడా చెయ్యనుంది.