ఐఏఎస్ కావాలనుకుందట!


చదువుకుంటున్న కాలంలో హీరోయిన్ రాశి ఖన్నా కన్న కల ఒక్కటే. ఐఏఎస్ ఆఫీసర్ కావాలనేది డ్రీం. హీరోయిన్ అనే ఆలోచన లేదు. రాశి ఖన్నా చదువులో ఫస్ట్. బాగా చదువుతున్నావు కదా ఐఏఎస్ కావొచ్చు అన్న సలహాతో అప్పుడు భావించింది. అదే ఉద్దేశంతో మాస్ కమ్యూనికేషన్ లో మాస్టర్స్ చేసింది. ఐతే, అనుకోకుండా మోడలింగ్ లో అడుగుపెట్టడంతో కల మారింది, కెరీర్ వేరు అయింది.

సరదాగా మోడలింగ్ చెయ్యడం, అక్కడి నుంచి సినిమాల్లోకి రావడం అనుకోకుండా జరిగిందట. దాంతో, జీవితమే మారిపోయింది.

” ఐఏఎస్ ఆఫీసర్ కావాలనుకున్నా. అలాగే, ఒక డాక్టర్ ని ప్రేమించాలనుకున్నా. రెండూ జరగలేదు. ఐతే, ఇప్పుడు అంతకన్నా మంచి స్థితిలో ఉన్నాను,” అని రాశి ఖన్నా చెప్తోంది.

ఈ భామ ప్రస్తుతం ‘థాంక్యూ’ సినిమా ప్రమోషన్ లో పాల్గొంటోంది. ఈ సందర్భంగా ఈ విషయాన్ని బయట పెట్టింది. నాగ చైతన్యతో కలిసి ఆమె నటించిన ‘థాంక్యూ’ ఈ నెల 22న విడుదల కానుంది. ‘పక్కా కమర్షియల్’ సినిమా అపజయం పాలు అయింది. కానీ, చైతన్య సినిమాపై మాత్రం చాలా ఆశలు పెట్టుకొంది.

 

More

Related Stories