
నయనతార తమిళనాట లేడీ సూపర్ స్టార్. అత్యధిక పారితోషికం తీసుకునే నటి. సోలోగా సినిమాని హిట్ చేసే స్టార్. ఐతే, నయనతార పేరు తరుచుగా రాజకీయ రగడకి కారణం అవుతూ ఉంటుంది. ముఖ్యంగా కొందరు రాజకీయనాయకులు, నటులు ఆమెని టార్గెట్ చేస్తూ చేసే కామెంట్లు చేస్తుంటారు. రాధారవి అనే సీనియర్ నటుడు, రాజకీయనాయకుడు గతంలో ఆమె క్యారెక్టర్ గురించి పిచ్చి కామెంట్స్ చేసి సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి గురయ్యారు.
ఆయనే మరోసారి నయనతారపై కామెంట్స్ చేశారు.
ప్రస్తుతం తమిళనాడులో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ ఎన్నికల్లో యువ హీరో ఉదయనిధి స్టాలిన్ (డీఎంకే అధినేత స్టాలిన్ కుమారుడు) కూడా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు. దాంతో, ఉదయనిధిపై విమర్శలు ఎక్కుపెట్టింది బీజేపీ. ఉదయనిధిని టార్గెట్ చేస్తూ నయనతార పేరుని లాగాడు బీజేపీ నేత రాధారవి. “ఉదయనిధికి, నయనతారకి ఎటువంటి సంబంధం ఉన్నా నాకు అనవసరం,” అంటూ వాళ్ళ మధ్య ఎదో ఉంది అన్నట్లుగా మాట్లాడాడు.
ఎన్నికల ప్రచారం కోసం నయనతార పేరుని వాడుకున్నారు రాధారవి.
నయనతార త్వరలోనే తన బాయ్ ఫ్రెండ్ విగ్నేష్ శివన్ ని పెళ్లాడనుంది. కానీ ఆమెకి ఈ చీప్ కామెంట్స్ మాత్రం తప్పడం లేదు.