అదరగొడుతున్న అడ్వాన్స్ బుకింగ్స్

- Advertisement -
Radhe Shyam

ఓ సినిమాపై ఎంత క్రేజ్ ఉందో చెప్పడానికి అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తే చాలు. మొన్నటికిమొన్న ‘భీమ్లానాయక్’ విషయంలో ఇదే జరిగింది. ఇప్పుడు ‘రాధేశ్యామ్ ‘తో ఆ విషయం మరోసారి ప్రూవ్ అవుతోంది. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ తాజాగా ఓపెన్ అయ్యాయి. ఇలా ఓపెన్ అయిన నిమిషాల వ్యవథిలోనే అన్ని షోల టికెట్లు అమ్ముడుపోయాయి.

మరీ ముఖ్యంగా హైదరాబాద్ సిటీలో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రభంజనం కొనసాగుతోంది. కేవలం రిలీజైన 11వ తేదీ మాత్రమే కాకుండా.. 12, 13 తేదీలకు కూడా టికెట్లు బుక్ అయిపోతున్నాయి.అమెరికాలో కూడా ప్రీ సేల్స్ బాగా ఉన్నాయి. ప్రీమియర్ షోకి 1 మిలియన్ పైనే వచ్చేలా ఉంది.

ప్రభాస్, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా నటించిన ‘రాధేశ్యామ్’ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో అడ్వాన్స్ బుకింగ్స్ జోరు చూస్తే తెలుస్తుంది. రాధాకృష్ణకుమార్ డైరక్ట్ చేసిన ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ నిర్మించింది. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు.

ఈ సినిమాలో చేయి చూసి జాతకాలు చెప్పే విక్రమాదిత్య పాత్రలో కనిపించబోతున్నాడు ప్రభాస్. ఇక ప్రేరణ అనే డాక్టర్ రోల్ లో పూజాహెగ్డే కనిపించనుంది. విధికి, ప్రేమకు మధ్య జరిగే యుద్ధంలో గెలుపు ఎవరిదనే కాన్సెప్ట్ తో వస్తోంది రాధేశ్యామ్.

 

More

Related Stories