బుల్లితెరపైకి రాధేశ్యామ్.. డేట్ లాక్

Radhe Shyam

ప్రభాస్ హీరోగా నటించిన రాధేశ్యామ్ సినిమా అనుకున్నదానికంటే తొందరగానే ఓటీటీలోకి వచ్చేసింది. ఎందుకంటే, ఈ సినిమా థియేటర్లలో ఫ్లాప్ అయింది కాబట్టి. అందుకు తగ్గట్టుగానే ఇప్పుడు అనుకున్న టైమ్ కంటే ముందుగానే టీవీల్లోకి కూడా వచ్చేస్తోంది ఈ సినిమా. రాధేశ్యామ్ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ డేట్ బయటకొచ్చింది.

ఈనెల 26 ఆదివారం నాడు రాధేశ్యామ్ సినిమా టీవీల్లో ప్రసారం అవుతుంది. ఆరోజు సాయంత్రం 6 గంటల నుంచి జీ తెలుగు ఛానెల్ లో రాధేశ్యామ్ సినిమా టెలికాస్ట్ అవుతుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రభాస్ ప్యాన్స్ అంతా వైరల్ చేస్తున్న న్యూస్ ఇది.  వాళ్లు ఈ న్యూస్ ను వైరల్ చేయడానికి ఓ రీజన్ ఉంది.

రాధేశ్యామ్ సినిమా థియేటర్లలో ఫ్లాప్ అయింది. ఆ తర్వాత తక్కువ టైమ్ గ్యాప్ లోనే ఓటీటీలోకి కూడా వచ్చేసింది. అమెజాన్ లో కూడా ఈ సినిమా ఫెయిలైంది. ఇప్పుడు బుల్లితెరపైకి ఈ సినిమా వస్తోంది.

కనీసం టీవీల్లోనైనా ఈ సినిమాకు భారీ రేటింగ్ వస్తే పండగ చేసుకోవాలని ప్రభాస్ ఫ్యాన్స్ ఆలోచన. అలా రాధేశ్యామ్ చేసిన గాయాల్ని మరిచిపోవాలని వాళ్లు అనుకుంటున్నారు.

 

More

Related Stories