రాధేశ్యామ్ కు గట్టి పోటీ తగిలింది!

- Advertisement -

‘రాధేశ్యామ్’ సినిమాను మార్చి 11కు రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. అన్ని సమీకరణాలు, లెక్కలు చూసుకొని మరీ ఈ తేదీని ప్రకటించారు. టాలీవుడ్ వరకైతే వీళ్ల లెక్కలన్నీ కరెక్ట్ గానే ఉన్నాయి. కానీ కోలీవుడ్ లో మాత్రం ఈ సినిమాకు పోటీ అనివార్యమైంది.

సూర్య నటిస్తున్న “ఈటీ” అనే సినిమాను “రాధేశ్యామ్” కంటే ఒక్క రోజు ముందు కోలీవుడ్ లో విడుదల చేయబోతున్నారు. మార్చి 10న థియేటర్లలోకి వస్తున్న సూర్య సినిమా, కచ్చితంగా రాధేశ్యామ్ కు పోటీనిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. సూర్య సినిమా థియేటర్లలోకొచ్చి చాలా రోజులైంది. “ఆకాశం నీ హద్దురా”, “జై భీమ్” లాంటి సినిమాలన్నీ నేరుగా ఓటీటీలోకి వచ్చేశాయి. దీంతో సూర్య సినిమాను థియేటర్లలో చూసేందుకు అతడి అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

అలా భారీ అంచనాలతో, యాక్షన్ సబ్జెక్ట్ తో వస్తోంది “ఈటీ” సినిమా. అలాంటి సినిమా రిలీజైన 24 గంటల వ్యవథిలో రాధేశ్యామ్ కోలీవుడ్ లో రిలీజ్ అవుతోంది. దీంతో సూర్య, ప్రభాస్ సినిమాల మధ్య గట్టిపోటీ ఉండబోతోంది.

అటు నార్త్ లో కూడా ప్రభాస్ కు చిన్న పోటీ ఎదురుకాబోతోంది. రాధేశ్యామ్ రిలీజైన వారం రోజులకే అక్షయ్ కుమార్ సినిమా అక్కడ రిలీజ్ అవుతోంది. ఇలా గట్టిపోటీ మధ్య విడుదలకు సిద్ధమైంది రాధేశ్యామ్ మూవీ.

 

More

Related Stories