కాస్త బయటకురా రాధేశ్యామ్

Radhe Shyam still

ప్రభాస్ నుంచి వెంటనే వచ్చే సినిమా ఏది? ప్రాక్టికల్ గా చూస్తే ‘రాధేశ్యామ్’ మాత్రమే. కానీ ప్రస్తుతం నడుస్తున్న ట్రెండింగ్స్ బట్టి చూస్తే మాత్రం ‘రాధేశ్యామ్’ కంటే ‘ఆదిపురుష్’, నాగ్ అశ్విన్ సినిమాలే ఎక్కువగా నలుగుతున్నాయి. ప్రమోషన్ లో ఈ రెండు సినిమాలు దూసుకుపోతుంటే.. ‘రాధేశ్యామ్’ మాత్రం అల్లంత దూరంలోనే ఆగిపోయాయి.

లిటరల్ గా చెప్పాలంటే ‘ఆదిపురుష్’ సినిమాకు సంబంధించి నెలకో అప్ డేట్ ఇస్తున్నారు. ఆగస్ట్ లో మూవీ ఎనౌన్స్ చేశారు. సెప్టెంబర్ లో విలన్ ఎవరో చెప్పారు. అక్టోబర్ లో, ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా హీరోయిన్ పేరు ఎనౌన్స్ చేస్తున్నారు. నవంబర్ కి కూడా మరో సర్ ప్రైజ్ ఉందని ఊరిస్తున్నారు.

ఇక నాగ్ అశ్విన్ చేయబోయే సైన్స్ ఫిక్షన్ సినిమా విషయానికొస్తే.. ముందుగా ప్రాజెక్టు ప్రకటించారు. తర్వాత హీరోయిన్ దీపికా పదుకోన్ పేరును ఆర్భాటంగా ప్రకటించారు. ఆ తర్వాత సింగీతం రాకను ఘనంగా ఎనౌన్స్ చేశారు. తర్వాత బిగ్ బి పేరును బయటపెట్టారు. ఇలా నాగ్ అశ్విన్ కూడా తన సినిమాతో బాగానే సౌండ్ చేస్తున్నాడు.

రాధేశ్యామ్ మాత్రం ఈ విషయంలో వెనకబడింది. అప్పుడెప్పుడో రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ తప్పితే మళ్లీ ఎలాంటి హంగామా లేదు. ఇంకా సెట్స్ పైకి కూడా రాని ప్రాజెక్టులపైనే ఇంత హంగామా నడుస్తున్నప్పుడు.. ఆల్రెడీ సెట్స్ పై ఉన్న సినిమాతో ఇంకెంత హంగామా చేయాలి? ఈ విషయంలో ‘రాధేశ్యామ్’ యూనిట్ వెనకబడింది.

Related Stories