మరి ప్రభాస్ సంగతేంటి?

మరి ప్రభాస్ సంగతేంటి?

పూరి జగన్నాధ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో రూపొందుతోన్న ‘లైగర్’ సెప్టెంబర్ 9న రిలీజ్ కానుంది. ఈ సినిమా విడుదలపై కూడా క్లారిటీ వచ్చింది. అంటే.. ఇక ఈ ఏడాది విడుదల కావాల్సిన వాటిల్లో మిగిలిన ఒకే ఒక్క ఇంపార్టెంట్ మూవీ… ‘రాధేశ్యామ్’.

ప్రభాస్ సినిమా అంటే దేశమంతా ఎదురుచూస్తుంది. తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపే హీరో ప్రభాస్. కాబట్టి ‘రాధేశ్యామ్” డేట్ గురించే అందరి ఆసక్తి.

‘రాధేశ్యామ్’ మే నెలలో విడుదలవుతుందా? లేక జూన్ లేదా జూలైలోనా? అన్నది క్లారిటీ కావాలి. ఈ రెండు నెలలు మిస్ అయితే మళ్ళీ సెప్టెంబర్ మూడో లేదా నాలుగో వారం బెటర్. ఇంతకీ… రాధే శ్యామ్ వచ్చేదెప్పుడు. ఈ కన్ఫ్యూజన్ వీడాలంటే… ఆదివారం వరకు ఆగాలి.

‘రాధేశ్యామ్’ టీజర్ ఈ నెల 14న వస్తుంది. అదే రోజు సినిమా రిలీజ్ డేట్ ప్రకటిస్తారు. సో కౌంట్ డౌన్ షురూ అయింది.

More

Related Stories