
రాధేశ్యామ్ కు కొత్త రిలీజ్ డేట్ వచ్చింది. అదే ఓటీటీ రిలీజ్ డేట్. అవును.. అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో ఉగాది కానుకగా ఏప్రిల్ 1న ఈ సినిమా స్ట్రీమింగ్ కు రాబోతోంది. ఈ మేరకు అమెజాన్ సంస్థ, అధికారికంగా ప్రకటించడంతో పాటు.. సెపరేట్ గా ప్రోమో కూడా రిలీజ్ చేసింది.
ఈ సినిమా రీసెంట్ గా థియేటర్లలోకి వచ్చింది. కానీ థియేటర్ల వద్ద బోల్తాకొట్టింది. అన్ని సెంటర్లలో ఫెయిల్యూర్ అనిపించుకుంది. ‘ఆర్ఆర్ఆర్’ రాకతో థియేటర్ల నుంచి మాయమైంది. అలా థియేటర్లలో ఫ్లాప్ అయిన రాధేశ్యామ్ సినిమా, ఇప్పుడు కాస్త తొందరగానే ఓటీటీలోకి వచ్చేస్తోంది.
నిజానికి ఓ సినిమాను ఓటీటీలో స్ట్రీమింగ్ కు పెట్టడానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. థియేట్రికల్ రిలీజ్ కు, ఓటీటీ రిలీజ్ కు మధ్య కనీసం 4 వారాల గ్యాప్ తప్పనిసరి. కానీ ‘రాధేశ్యామ్’ విషయంలో ఆ నిబంధనల్ని పక్కనపెట్టినట్టు కనిపిస్తోంది. మార్చి 11న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ఏప్రిల్ 1కే ఓటీటీలోకి వచ్చేస్తోంది.
ప్రభాస్, పూజాహెగ్డే హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను రాధాకృష్ణ కుమార్ తెరకెక్కించాడు. యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ బ్యానర్లపై తెరకెక్కిన ఈ సినిమాలో చేయి చూసి జాతకాలు చెప్పే విక్రమాదిత్య పాత్రలో కనిపించాడు ప్రభాస్.
రాధేశ్యామ్, రాధేశ్యామ్ ఓటిటి రిలీజ్ డేట్,