
ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రూపొందిన భారీ చిత్రం…’రాధే శ్యామ్’. ఇది పాన్ ఇండియా చిత్రం. ఇప్పటికే ముంబైలో ప్రొమోషన్ చేశాడు ప్రభాస్. చెన్నైలో కూడా తమిళ వర్షన్ కోసం పబ్లిసిటీ మొదలు అయింది. కన్నడ, మలయాళ ప్రొమోషన్ కూడా జోరుగా సాగనుంది.
రాధాకృష్ణ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఈ నెల 11న థియేటర్లలో విడుదల కానుంది. లేటెస్ట్ గా ఈ సినిమా ఓటిటి హక్కులను భారీ మొత్తానికి అమ్మారు. అమెజాన్ ప్రైమ్ కొనుగోలు చేసింది. ఐతే, థియేటర్లలో రిలీజయిన నాలుగు వారాల తర్వాతే అమెజాన్ లోకి వస్తుంది. అలా ఒప్పందం చేసుకున్నారట.
రెండు వారాల్లోనే ఓటిటిలోకి తెస్తే థియేటర్లలో సినిమాలు ఆడటం లేదు. దాంతో, ఇప్పుడు పెద్ద సినిమాలు నాలుగు వారాల గ్యాప్ తర్వాతే ఓటిటిలో విడుదల చెయ్యాలని ఫిక్స్ అయ్యాయి.
ALSO CHECK: Pooja Hegde, the red hot girl!
ఒక్కో భాషలో ఒక్కో స్టార్ ఈ సినిమాకి వాయిస్ ఓవర్ చెప్పారు. తెలుగులో రాజమౌళి, హిందీలో అమితాబ్ బచ్చన్, కన్నడలో శివరాజ్ కుమార్, మలయాళంలో పృథ్విరాజ్ సుకుమారన్, తమిళంలో సత్యరాజ్ సినిమాని నేరేట్ చేస్తారు.