మొత్తానికి గుమ్మడికాయ కొట్టనున్నారట

Radhe Shyam


ఈ రోజే, రేపో ‘రాధేశ్యామ్’ షూటింగ్ కి గుమ్మడికాయ కొడుతున్నారు. 2018 సెప్టెంబర్ లో సినిమా షూటింగ్ మొదలైంది. 2021 జులై వరకు షూటింగ్ జరుపుకొంది. నాలుగేళ్లు ఆగుతూ, సాగుతూ ఇక్కడిదాకా వచ్చింది. బాహుబలి సినిమా కన్నా దీనికే ఎక్కువ టైం తీసుకున్నారు ప్రభాస్, దర్శకుడు రాధాకృష్ణ కుమార్.

ఇది పూర్తిగా ప్రేమకథా చిత్రమే. కానీ గ్రాఫిక్స్, సెట్స్ భారీగానే ఉన్నాయి. ఈ గ్యాప్ లో ప్రభాస్ ‘సాహో’ సినిమాని పూర్తి చేసి విడుదల చేశారు.

ఇంటర్ నెట్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో హీరోయిన్ జాతకం ముందే చెప్పేస్తాడు. నీకు ప్రాణగండం ఉందని ప్రేరణ (పూజ హెగ్డే)కి విక్రమాదిత్య (ప్రభాస్) చెప్తాడట. ఆ తర్వాత ఆమెతోనే అతను ప్రేమలో పడుతాడు. చనిపోతుంది అని తెలిసి ఆమెని ఎందుకు ప్రేమిస్తాడు? ఆమెని కాపాడుతాడా లేదా అన్నదే కథ. ఇందులో నిజమెంతో తెలీదు కానీ సినిమా టైటిల్, మొదటి లుక్ పోస్టర్ లో ఉన్న ఎలెమెంట్స్ ఆధారంగా ఫ్యాన్స్ అల్లిన కథలా అనిపిస్తోంది.

త్వరలోనే ఈ మూవీ రిలీజ్ డేట్ ప్రకటిస్తారు.

 

More

Related Stories