
“తెలుగు ప్రజలకు నేను రుణపడి ఉన్నాను ఎందుకంటే ఎప్పటినుంచో నన్ను ఆదరిస్తున్నారు. వాళ్ళ ప్రేమ వెలకట్టలేనిది. శరత్ మరార్ గారు నాకు చాలా సంవత్సరాల నుండి తెలుసు తనను చిరంజీవి గారి దగ్గర చూసేదాన్ని. ఆయన నన్ను కలిసి వెబ్ సిరీస్ కథ చెప్పడం జరిగింది. నేను ఇప్పటివరకు ఏ భాషలోనూ వెబ్ సిరీస్ చేయలేదు. సినిమాలలో చాలా క్యారెక్టర్లు చేశాను ముందు కథ విందామని ఈ కథ వినడం జరిగింది. కథ నచ్చడంతో ఈ గాలివాన వెబ్ సిరీస్ చేస్తున్నాను. మంచి ఫ్యామిలీ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ను దర్శకుడు శరణ్ కొప్పిశెట్టి చాలా బాగా డీల్ చేశాడు,” అని ఆనందం వ్యక్తం చేశారు రాధిక.
రాధిక శరత్ కుమార్, సాయికుమార్ ప్రధాన పాత్రల్లో రూపొందిన వెబ్ సిరీస్… గాలి వాన. చైతన్య, నందిని రాయ్, అశ్రిత వేముగంటి, తాగుబోతు రమేష్, అర్మాన్, శరణ్య ప్రదీప్ ఇతర పాత్రలు పోషించారు.
ఈ నెల 14 న ZEE5 లో స్ట్రీమ్ కానుంది ‘గాలి వాన’.
“సావిత్రి గారి దగ్గరనుంచి అందరితో వర్క్ చేశాను కానీ.. ఒక రాధికా గారితో మాత్రం మిస్ అయింది. మా నాన్న గారు రాధిక గారు నటించిన న్యాయం కావాలి సినిమాలో జడ్జిగా యాక్ట్ చేశాడు. చివరికి ఇప్పుడు రాధిక గారితో వర్క్ చేయడం చాలా సంతోషంగా ఉంది,” అని అన్నారు సాయి కుమార్.