‘హీరోయిన్లను తక్కువ చేయొద్దు’

హీరోయిన్లను కూడా హీరోలకి సమానంగా ట్రీట్ చెయ్యాలి అని డిమాండ్ చేస్తోంది రాధిక ఆప్టే. హీరోలకు ఇచ్చినట్లే గౌరవం ఇవ్వడం, సౌకర్యాలు కల్పించడాలు వరకే నిర్మాతలు పరిమితం అవుతున్నారు. కానీ, పారితోషికం విషయంలో మాత్రం జమీన్ ఆస్మాన్ ఫరక్ చూపిస్తున్నారు అని చెప్తోంది రాధిక.

10 నుంచి 100 కోట్లకు పైగా తీసుకుంటారు హీరోలు వారి వారి క్రేజ్, సక్సెస్ రేట్ ని బట్టి. కానీ, హీరోయిన్ల పారితోషికాలు మాత్రం 25 లక్షల నుంచి 5, 6 కోట్ల వరకు మాత్రమే ఉంటుంది. దీపిక మినహా మిగతా ఏ హీరోయిన్ కి 10 కోట్ల పారితోషికం లేదు. అదే ఒకట్రెండు హిట్లు కొట్టిన హీరోలు పది కోట్లు తీసుకుంటున్నారు. ఇదెంత అన్యాయం? ఇది రాధిక ఆప్టే ఆర్గ్యుమెంట్.

ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల విషయంలో ఎక్కువగా వేధింపులు ఉండేవి. ఇప్పడు చాలావరకు ప్రొఫెషనల్ గా మారాయి చిత్ర పరిశ్రమలు. అలాగే, పారితోషికం విషయంలో కూడా హీరోయిన్లను తక్కువ చూడొద్దు అనేది రాధిక ఆప్టే డిమాండ్.

ఐతే, నిర్మాతల వాదన వేరు. ఎంత పెద్ద హీరోయిన్ అయినా సోలో గా సరైన ఓపెనింగ్ తీసుకురావడం లేదు. ఇప్పటికీ హీరోల వల్లే ఓపెనింగ్స్ వస్తున్నాయి. సో, హీరోలకు సమానంగా హీరోయిన్లకు ఎలా ఇస్తామని వారు అంటున్నారు.

సినిమా ఇండస్ట్రీలో పారితోషికాలు పూర్తిగా ఆయా నటులకు ఉన్న క్రేజ్, వారు తెచ్చే కలెక్షన్లు, ఓపెనింగ్స్ బట్టి ఆధారపడి ఉంటాయి. ఒకవేళ ఏ హీరోయిన్ అయినా హీరోలా మాదిరిగా సొంత పేరు, ఇమేజ్ తో ఓపెనింగ్స్ తేగలిగితే ఆ హీరోయిన్ కి ఆటోమేటిక్ గా పారితోషికం పెరుగుతుంది కదా అనేది నిర్మాతల మాట.

Advertisement
 

More

Related Stories