చాన్నాళ్ళకి ట్రెండింగ్లో రాధిక

Radhika Apte

రాధిక ఆప్టే… ఒకప్పుడు ఆమె పేరు మార్మోగింది. ఆమె మాట, ఆమె బాట సెపరేట్. దాచుకోకుండా అందాలు ఆరబోయలన్నా, ఫెమినిస్ట్ లా మాట్లాడాలన్నా ఆమెకే చెల్లింది. ఐతే, అంతర్జాతీయ చిత్రాల మోజులో పడి బాలీవుడ్ లో, సౌత్ లో సినిమాలు తగ్గించుకొంది. దాంతో, ఆమెకి గ్యాప్ పెరిగింది. ఇప్పుడు మొత్తంగా ఆమెని మర్చిపోయే పరిస్థితి వచ్చింది.

చాలా ఏళ్ల తర్వాత ఆమె పేరు సడెన్ గా ట్విట్టర్ లో ట్రెండ్ కావడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఆమె నటించిన ఒక కొత్త సినిమా టీజర్ విడుదలైంది. అందులో ఆమె రెండు సెకండ్లకి మించి కనిపించలేదు. అయినా, ఆమె ట్రెండింగ్లోకి వచ్చింది.

హృతిక్ రోషన్, సైఫ్ అలీ ఖాన్ హీరోలుగా నటించిన “విక్రమ్ వేద” అనే హిందీ మూవీలో ఆమె సైఫ్ సరసన నటించింది. ఈ టీజర్ లో ఆమె సైఫ్ తో ఒక చిన్న రొమాంటిక్ సీన్లో కనిపిస్తుంది. అంతే, దానికే కుర్రకారు ఆమె పేరుని ట్రెండ్ చేశారు. ఆమె ఒక హాలీవుడ్ చిత్రంలో నగ్నంగా నటించిన పాత ఫోటోలు పోస్ట్ చేస్తూ ఆమె పేరుతో రచ్చ చేశారు. దీన్ని బట్టి చూస్తే ఆమెకి గ్యాప్ వచ్చింది కానీ జనం మైండ్ నుంచి పూర్తిగా ఫేడవుట్ కాలేదు. రసిక శిఖామణులు ఇంకా ఆమెని గుర్తుకుపెట్టుకోని పాత ఫోటోలు షేర్ చేశారు.

Vikram Vedha Teaser | Hrithik Roshan, Saif Ali Khan | Pushkar & Gayatri | Radhika Apte|Bhushan Kumar

తెలుగులో ఆమె ‘లెజెండ్’, ‘రక్త చరిత్ర’, ‘కబాలి’ (డబ్బింగ్) వంటి చిత్రాల్లో నటించింది.

 

More

Related Stories