ఆస్తుల చిట్టా విప్పిన రాధిక!

Radhika

రాధికా శరత్ కుమార్ బీజేపీ తరఫున లోక్ సభకి పోటీ చేస్తున్నారు. తమిళనాడులోని విరుధ్ నగర్ లోక్ సభ నుంచి పోటీకి దిగిన ఆమె తాజాగా తన ఆస్తుల వివరాలను ఎన్నికల సంఘానికి సమర్పించారు.

మొత్తం ఆస్తుల విలువ: రూ. 53.45 కోట్లు
నగదు” రూ.33.01 లక్షలు
ఆభరణాలు: 75 తులాల బంగారం , 5 కేజీల వెండి ఆభరణాలు
చరాస్తి: రూ.27.05 కోట్లు
స్థిరాస్తి: రూ.26.40కోట్లు

అంతేకాదు 14 కోట్ల అప్పులు కూడా ఉన్నట్లు వెల్లడించారు. మొత్తానికి రాధిక తనకు భారీ మొత్తంలో ఆస్తులు ఉన్నట్లు తెలిపారు.

ఆమె 1980లలో పెద్ద హీరోయిన్. ఐతే నటిగా కన్నా టీవీ సీరియల్స్ నిర్మాతగా ఆమె ఎక్కువ సంపాదించింది.

 

More

Related Stories