ఇప్పుడన్నీ తెలిసొచ్చాయి: రాధికా ఆప్టే

ఒకప్పుడు రాధికా ఆప్టే రెబెల్. ఇంకా చెప్పాలంటే నోమాడ్. అంటే సంచార జీవి. హాలీవుడ్, బాలీవుడ్, మరాఠీ సినిమా, తెలుగు సినిమా, ప్రపంచ సినిమా … ఇలా అన్ని ఒప్పుకొంటూ, అన్ని సినిమాలు చేసుకుంటూ వెళ్ళింది. ఇంటిపట్టున ఉన్నది తక్కువ. కెరీర్ మీద ఫోకస్ పెట్టి అది ఎటు తీసుకెళ్తే అటు వెళ్ళింది.

ఐతే, కోవిడ్ తర్వాత ఆమెకి కుటుంబం విలువ తెలిసొచ్చిందట. అలాగే, మన ఇల్లు ముఖ్యం అని అర్థమైంది.  తల్లితండ్రులు, మన వాళ్ళు మాత్రమే మనకి ఎప్పుడూ తోడ్పాటుగా ఉంటారని గ్రహించింది ఈ భామ.

ప్రపంచం అంతా చుట్టినా … ఫైనల్ గా ఇంట్లోనే సెటిల్ కావాలన్న జీవిత సత్యం ఇప్పుడు తెలిసొచ్చిందని చెప్పింది ఈ బ్యూటీ.

More

Related Stories